వరంగల్ కరీమాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ నామాల రాజు కుమారుడు లోకేష్ పాలీసెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. పదో తరగతిలో 568 మార్కులు సాధించిన అతడు, ఎంబీపీసీ విభాగంలోనూ 6వ ర్యాంక్ కొట్టి సత్తా చాటాడు. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు.