నిర్మల్ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంలోని టూరిజం ప్రాంతాలను పరిశీలించి, మధ్యాహ్నం 1.30 గంటలకు ఖానాపూర్‌లో బొద్దికుంట చెరువు అభివృద్ధి పనులు, దస్తురాబాద్‌లో పీహెచ్సీ సబ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు.