మాజీ మిస్ పుణె, నటి ట్విష శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారించే అవకాశం ఉంది. ఇటీవల భోపాల్లోని అత్తవారింట్లో ట్విష ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పెళ్లై 5 నెలలు కాగా, మృతి చెందడానికి ముందు తన తల్లి, స్నేహితురాలికి మెసేజ్లు పంపినట్లు తెలుస్తోంది.