AP: అకాల వర్షాలతో ముగ్గురు చనిపోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు హోంమంత్రి అనిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వర్షాలు పడేటప్పుడు చెట్లు, స్తంభాలు, హోర్డింగ్ల వద్ద ఉండవద్దని సూచించారు. తీవ్ర ఎండలు, అకాలవర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.