AP: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరిగిన ఏపీ ఎస్సెట్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ షెడ్యూల్ ప్రకారం ఈరోజు విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈనెల 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. ప్రిలిమినరీ కీతో పాటు విద్యార్థుల రెస్పాన్స్ షీట్స్‌ను అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని తెలిపారు.