SRCL: సిరిసిల్ల పట్టణ బీఎస్పీ అధ్యక్షుడిగా తడక భానును నియమిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు కొమ్మాట అశోక్ తెలిపారు. ఈ మేరకు సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భానుకు నియామక పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ.. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు.