అల్లు అర్జున్ ‘రాకా’ మూవీపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో NTR ‘శక్తి’ మూవీలో విలన్ పేరు రాకా కావడంతో, నెటిజన్లు ఆ డిజాస్టర్‌ను గుర్తు చేస్తూ మీమ్స్ వేస్తున్నారు. దీంతో దర్శకుడు మెహర్ రమేష్ పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే, కేవలం పేరు కలిసినంత మాత్రాన పాత ఫ్లాపులతో ముడిపెట్టడం సరికాదని బన్నీ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.