TG: శంషాబాద్ నుంచి కోల్కతా వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ తీసుకునే సమయంలో పైలట్ ఇంజిన్లో సమస్యను గుర్తించాడు. విమానాన్ని తిరిగి పార్క్ చేసి ప్రయాణికులను కిందకు దింపారు. మ.3.15 గంటల నుంచి శంషాబాద్లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.