HNK: ఈ నెల 25న కాకతీయ యూనివర్సిటీలో జరిగే తెలంగాణ రాష్ట్ర లా విద్యార్థుల కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామేర కిరణ్ పిలుపునిచ్చారు. గురువారం రాంనగర్‌లోని SFI జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర లా విద్యార్థుల కన్వెన్షన్ వాల్ పోస్టర్లను హనుమకొండ జిల్లా కమిటీతో కలిసి ఆవిష్కరించారు. SFI నేతలు ఉన్నారు.