తెలంగాణ పదో తరగతి ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 16న పరీక్షలు ముగియనుండగా, ఏప్రిల్ 23లోపు మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన సబ్జెక్టుల పేపర్ల దిద్దుబాటు ప్రారంభమైంది. జూన్ నుండి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఫలితాల ప్రక్రియను వేగవంతం చేసింది.