NGKL: కోడేరు మండల కేంద్రంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, ముఖ్యంగా మహిళా విద్యాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడని కొనియాడారు.