SDPT: సిద్దిపేట విద్యుత్ డీఈ ఆఫీస్ వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. ఈ నిరసనకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు హాజరై సంఘీభావం ప్రకటించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ ఒకే విధమైన సర్వీస్ రూల్స్ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టిజన్లకు ప్రత్యేక నిబంధనలు వర్తింపజేస్తూ వివక్ష చూపడం తగదని, అందరినీ సమానంగా చూడాలన్నారు.