NRML: గోదావరి నదిలో ప్రమాదవశాత్తు కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను గంగపుత్రులు కాపాడిన ఘటన బాసర పుణ్యక్షేత్రంలో శనివారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన భక్తులు శనివారం బాసరకు వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గమనించిన గంగ పుత్రుడు నరేష్ వారిని కాపాడి ప్రాణాలు రక్షించారు.