GDWL: జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. కుల వివక్ష లేని సమాజం కోసం, మహిళా విద్య కోసం పూలే దంపతులు చేసిన పోరాటం మరువలేనిదని వారు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.