SDPT: సిద్ధిపేట రూరల్ మండలం నాంచారుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జ్యూస్, గ్లూకోజ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ ప్రతినిధుల ఉదారతపై పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.