MDK: రామాయంపేటలోని ఓ బీడీ సెంటర్లో పెరిగిన వేతనాల కరపత్రాన్ని ఫెడరేషన్ సహాయ కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ విడుదల చేశారు. వెయ్యి బీడీలకు రూ. 5.50, ప్యాకింగ్‌కు రూ. 8.60 చొప్పున పెరిగిన వేతనాన్ని ఈ నెల నుండే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమలు చేయని పక్షంలో సెంటర్ల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి, గంగాధర్, శ్యామల పాల్గొన్నారు.