NRPT: వాహనదారులు డిఫెన్స్ డ్రైవింగ్ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్పీ వినీత్ శనివారం తెలిపారు. ఇతర వాహనదారుల తప్పులను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడటమే డిఫెన్స్ డ్రైవింగ్ అని ఆయన వివరించారు. డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. తప్పనిసరిగా సీట్ బెల్ట్, హెల్మెట్ వాడాలని సూచించారు.