గువాహటి వేదికగా జరిగిన IPL మ్యాచ్లో RR 6 వికెట్ల తేడాతో RCBపై విజయం సాధించింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 18 ఓవర్లలోనే ఛేదించింది. యువ సంచలనం వైభవ్ (26 బంతుల్లో 78) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, ధ్రువ్ జురెల్ (81*) అజేయ అర్ధశతకంతో మెరిశారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా, హెజెల్వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు.