‘లాల్సింగ్ చద్దా’ మూవీలో తనకంటే తన కుమారుడు జునైద్ ఖాన్ నటిస్తే బాగుంటుందని అనుకున్నట్లు అమీర్ ఖాన్ చెప్పాడు. జునైద్ నటనను చూసి ఆశ్చర్యపోయానని, అతన్నే హీరోగా తీసుకోవాలని నిర్మాతలను కోరినట్లు తెలిపాడు. కానీ వారు అంగీకరించలేదన్నాడు. అయితే షూటింగ్ సమయంలో జునైద్ నటననే స్ఫూర్తిగా తీసుకున్నానని, అది తనపై ఎంతో ప్రభావం చూపిందని పేర్కొన్నాడు.