తెలుగులో మాస్ ఇమేజ్ పక్కన పెట్టి హీరోలు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్, సుజీత్ కలయికలో సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతుందట. అడివి శేష్ థ్రిల్లర్స్ వదిలి సాయి మార్తాండ్ దర్శకత్వంలో లవ్ స్టోరీ చేయనున్నాడట. గోపీచంద్, సంకల్ప రెడ్డి పీరియాడిక్ యాక్షన్ డ్రామా రాబోతుంది. విజయ్ దేవరకొండ శౌర్యువ్ దర్శకత్వంలో పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీకి సిద్ధమయ్యాడు.