TG: నల్గొండ జిల్లాలో రోడ్డుపక్కన ఆగి ఉన్న వాహనాలలో డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు అంతరాష్ట్ర దొంగల ముఠాను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు నిందితులలో ఓ మైనర్ కూడా ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి పోలీసులు 1000 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు.