MLG: లీలా గార్డెన్లో జరిగిన డీసీసీ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రజల సమస్యలు గ్రామాలకే వెళ్లి అక్కడే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మండలాల వారీగా గ్రామాలను సమీకరించి గ్రామసభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల మధ్య ఉండి పని చేసిన వారే నిజమైన నాయకులుగా ఎదుగుతారని అన్నారు.