GDWL: అయిజ మున్సిపాలిటీ 19వ వార్డుకు చెందిన రాజగోపాల్ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరసింహులకు ఇవాళ వినతిపత్రం సమర్పించారు. మడ్డి గుంత కాలనీ నివాసి అయిన ఆయన తన అర్హతలను వివరించగా, వైస్ ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా ప్రభుత్వం తరపున కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.