NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 20వ వార్డులో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల కౌన్సిలర్ చీముల లలితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులకు టీబీ, క్షయ వంటి పరీక్షలు చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.