KMM: వైరా మండలం లాలాపురంలో కాంగ్రెస్ నేత నామ శ్రీనివాసరావు (45) దుర్మరణం చెందారు. స్థానిక కథనం మేరకు శనివారం గ్రామంలోని ఓ బ్రిక్స్ ఫ్యాక్టరీ భవనంపై ఉన్న ఆయనపై కోతులు ఒక్కసారిగా దాడికి ప్రయత్నించాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.