SDPT: సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి హరీశ్ రావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమని ఈ సందర్భంగా హరీశ్ రావు కొనియాడారు. సామాజిక సమానత్వం కోసం ఫూలే సాగించిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు.