ADB: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని DCC ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ అన్నారు. మావల మండల కేంద్రంలో పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతం, ఓటర్ల నమోదు, బూత్ స్థాయి వ్యవస్థను మరింత బలంగా తీర్చిదిద్దడం పలు అంశాలపై చర్చించినట్లు కరుణాకర్ పేర్కొన్నారు.