RCBతో జరుగుతున్న మ్యాచ్లో RR యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డ వైభవ్, 5 ఓవర్లకే స్కోరును 73/1కి చేర్చాడు. ప్రస్తుతం 57 పరుగులతో క్రీజులో ఉన్నాడు. RR గెలవాలంటే మరో 90 బంతుల్లో 129 పరుగులు చేయాలి.