TG: కాంగ్రెస్లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. గత BRS పాలనలో ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి నేతలు ఎందుకు బయటకు వచ్చారో గుర్తుంచుకోవాలన్నారు. పొన్నాల లక్ష్మయ్యకు అక్కడ దక్కుతున్న గౌరవం ఏంటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ నేతలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు.