NDL: సిరివెళ్ల మండలం జిన్నేపల్లె గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు తీగలు తగలడంతో ఓ రైతుకు చెందిన ట్రాక్టర్‌పై ఉన్న జొన్న సొప్ప మంటల్లో దగ్ధమైంది. మూగజీవులకు ఆహారంగా ఉపయోగపడాల్సిన సొప్ప కాలిపోవడంతో రైతు తీవ్రంగా విలపించాడు. ఈ ఘటనతో రైతుకు ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.