NRML: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి నిర్మల్ జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై గ్రామసభలు, విద్యార్థుల ర్యాలీలు, డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను తగ్గించాలని ఎస్పీ జానకి షర్మిల కోరారు.