ADB: ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ పార్టీ లక్ష్యమని జిల్లా కార్యదర్శి మూడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నారు. ప్రజల పక్షాన పోరాడే సీపీఐ పార్టీని ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు.