NZB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 13నుంచి 18వ తేదీ వరకు కొనసాగనున్న అరైవ్- అలైవ్ కార్యక్రమాలను జిల్లాలో విస్తృత స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, CP సాయిచైతన్య సూచించారు. కలెక్టర్, సీపీ గురువారం సాయంత్రం శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమష్టి కృషితో ‘అరైవ్-అలైవ్’ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.