KMM: ఉమ్మడి జిల్లాలో వేసవి తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 44°C దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 – 4 గంటల వరకు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.