బరువు తగ్గాలనుకునే వారు డైటింగ్ పేరుతో ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు. ఫైబర్, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మొలకెత్తిన గింజలు, ఓట్స్, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉన్న పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరపు ఆకలిని తగ్గిస్తాయి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటే బరువు సులభంగా అదుపులోకి వస్తుంది.