KDP: వేంపల్లి మండలం ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటి కళాశాల నూతన డైరెక్టర్‌గా గడ్డం విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని డైరెక్టర్ ఛాంబర్లో ప్రభుత్వాదేశానుసారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఉన్న డైరెక్టర్ కుమారస్వామి గుప్తా హైదరాబాద్ యూనివర్సిటీకి బదిలీ అయ్యారు.