తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 4, 6, 9, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’, పర్యావరణ వారోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.