KDP: మైలవరం పోలీస్ స్టేషన్లో దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన అడ్వకేట్ పల్లా బాలుగ్రం మిస్సింగ్ ఘటనపై కేసు నమోదు అయింది. ఈ నెల 6వ తేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య సుదర్శన దేవి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని మైలవరం ఎస్సై కోరారు.