SRD: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14వ తేదీన సంగారెడ్డిలో నిర్వహించి మహా ర్యాలీ కరపత్రాలను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని చెప్పారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు ర్యాలీకి హాజరుకావాలని కోరారు.