PLD: నాగార్జునసాగర్ కుడి కాలువకు ప్రభుత్వం విడుదల చేసిన 10 TMCల నీటిని కేవలం తాగునీటి అవసరాలకే వాడుకోవాలని పిడుగురాళ్ల ఇరిగేషన్ ఇన్ఛార్జ్ డీఈ ఆదినారాయణ కోరారు. ఎండల తీవ్రత వల్ల ప్రజల తాగునీటి ఎద్దడిని నివారించడానికే ఈ నీటిని ఇచ్చారని చెప్పారు. రైతులు దీనిని వ్యవసాయానికి మళ్లించకుండా.. గ్రామాల్లోని తాగునీటి చెరువులు, కుంటలు నింపడానికి సహకరించాలన్నారు.