VZM: ఖరీఫ్‌కి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఖరీఫ్‌లో అదనంగా 6000 ఎకరాల్లో ఉద్యాన పంటలు వేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడి వీటి రామారావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, ఉద్యాన శాఖ డీడీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.