PPM: సమస్యలు చెప్పండి… పరిష్కారానికి ప్రయత్నిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పార్వతీపురం మండలంలోని కే.ములగ గ్రామంలో గ్రామ బాట కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.