సత్యసాయి: సోమందేపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 57 ప్రభుత్వ పాఠశాలలకు బుధవారం పుస్తకాలు పంపిణీ చేశారు. సోమందేపల్లి MEO-2 ఆనంద్ టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఇతర స్టేషనరీ సామగ్రిని అందజేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టెస్ట్ బుక్స్, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభానికి ముందుగానే అవసరమైన పుస్తకాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.