KKD: కాకినాడ నగరంలో కాలువలను ఆక్రమించి పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్న వారిపై నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ కఠిన చర్యలు చేపట్టారు. మహాలక్ష్మీ నగర్ ప్రాంతంలో పర్యటించిన ఆయన కాలువపై అక్రమంగా పశువుల పాక నిర్మించిన యజమానికి రూ.3 వేల జరిమానా విధించి వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనంతరం డ్రైనేజీ పూడిక తొలగింపు పనులను పరిశీలించారు.