AP: రాజకీయాల్లో కులదూషణలు ఎక్కువయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే కులం పేరుతో దూషిస్తున్నారని, ఇదే ఒరవడి కొనసాగితే పరిపాలన సాగించడం కూడా కష్టమవుతుందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. YCP వచ్చాక కుల దూషణలు మరింత పెరిగాయని ఆరోపించారు. ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి.. అతడి కులాన్ని కాదని పవన్ హితవు పలికారు.