NZB: బాల్కొండ మండల కేంద్రంలో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ సంఘటనల నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శైలేందర్ సూచించారు. ముఖానికి మాస్కులు, క్యాపులు ధరించిన అపరిచితుల పట్ల మరింత నిఘా ఉంచాలని, ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 8712659860, 8712659756 నెంబర్కు సంప్రదించాలన్నారు.