NLR: చేజర్ల మండలం తిమ్మాయిపాలెం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య ఉంటుందని తెలియజేశారు. మూడు నుంచి ఆరు సంవత్సరాలు నిండని పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు తెలియజేశారు.