CTR: తోతపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తోతపూరి మామిడి ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై విజయవాడ నుంచి ఇవాళ వర్చువల్ విధానంలో సమీక్షించారు.