JGL: విద్యార్థులు తక్కువ గల పాఠశాలలపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా అన్నారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల నమోదు పెంచుటకు గ్రామంలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లత పాల్గొన్నారు.