TPT: తిరుపతి కలెక్టరేట్లో 0-6 ఏళ్ల పిల్లల సమగ్ర వికాసం కోసం నిర్వహిస్తున్న ఏఐ ఆధారిత ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్మెంట్ (ECD) స్క్రీనింగ్ శిక్షణ రెండో రోజు విజయవంతంగా జరిగింది. ఐదు ప్రాజెక్టుల సీడీపీవోలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులు పాల్గొని చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను ముందుగానే గుర్తించడంలో ఏఐ సాంకేతికత వినియోగంపై శిక్షణ పొందారు.